- Advertisement -
న్యూఢిల్లీ : ఢిల్లీలో ఇంతవరకు టీకా డోసుల పంపిణీ శనివారం నాటికి కోటి సంఖ్య దాటింది. అర్హులైన జనాభాలో 50 శాతం మంది కనీసం ఒక టీకా డోసైనా అందుకోగలిగారని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తెలియచేశారు. మరిన్ని టీకాలు నగరానికి అందుబాటు లోకి రాగలవన్న ఆశాభావాన్ని ఆయన తెలియచేశారు. అర్హులైన 1.5 కోట్ల మందిలో 74 లక్షల మంది టీకా డోసులు అందుకున్నారని ఈ 74 లక్షల మందిలో 26 లక్షల మంది రెండు డోసులు అందుకున్నారని చెప్పారు. కోటి సంఖ్య దాటినందుకు వైద్య సిబ్బందిని అభినందించారు. రోజూ కనీసం మూడు లక్షల మందికి టీకా ఇచ్చే సామర్ధం ఉన్నప్పటికీ కానీ టీకా కొరత కారణంగా 50 వేలు నుంచి 80 వేల లోపు మందికే అందుతున్నాయని చెప్పారు.
1 cr Covid vaccine doses given in Delhi
- Advertisement -