మనతెలంగాణ/ములకలపల్లి : గత వర్షాకాలంలో తాళ్ళపాయ గ్రామ సమీపంలోని పాములేరు వాగు ఉదృతికి దాదాపు కిలోమీటరు వరకు రహదారి తీవ్ర కోతకు గురైనది. కోతకు గురైన వాగుకు రిటైనింగ్ వాల్ నిర్మాణానికి ఎంఎల్‌ఎ మెచ్చా నాగేశ్వరరావు కృషితో ముఖ్యమంత్రి కెసిఆర్ 1 కోటి 85 లక్షల రూపాయిలను శుక్రవారం సాయింత్రం మంజూరు చేస్తూ జివో కాఫీని విడుదల చేసారని ఎంఎల్‌ఎ కార్యాలయం నుండి ఒక ప్రకటనను పత్రికలకు విడుదల చేసారు. వివరాలలోకి వెల్తె రెండు సంవత్సరాల నాడు కోతకు గురైన రహదారికి ఆనాడు ఎంఎల్‌ఎ కృషితో కొన్ని నిధులు విడుదల కాగ ఇంజినీరింగ్ అధికారులు కాంట్రాక్టర్ ద్వారా పనులు పూర్తి చేసినారు. మరల కుర్షిన ఆకాల వర్షాలకు రహదారి మరల కోతకు గురైనది.ఆసమయంలో రహదారిని ఎంఎల్‌ఎ మెచ్చానాగేశ్వరరావు పరిశీలించినారు.
చిన్న చిన్న మర్మత్తులు చేసిన మరల రహదారి కోతకు గురవుతుందని రహదారి పక్కన గల వాగు పరివాహంలో రిటైనింగ్ వాల్ నిర్మిస్తే శాశ్వత పరిష్కారం లబిస్తుందని బిఆర్‌ఎస్ మండల అధ్యక్షులు మోరంపూడి అప్పారావు, యంపిపి మట్ల నాగమణి,తాళ్ళపాయ సర్పంచ్ బైటి రాజేష్ ,మండల నాయకులు కోండ్రు సుందర్‌రావు,బైటి రాముదొర,పువ్వాల మంగపతి,శనగపాటి సీతారాములు,పాలకుర్తి ప్రసాద్,తదితరులు ఎంఎల్‌ఎ కు విన్నవించినారు.తక్షణమే స్పందించిన ఎంఎల్‌ఎ రిటైనింగ్ వాల్ నిర్మాణానికి అంచనాలను తయారు చేయమని ఆర్ అండ్ బి అధికారులను ఆదేశించినారు. అనంతరం ఎంఎల్‌ఎ పట్టువదలని విక్రమార్కుడు వలె ఆనాటి నుండి నిధుల విడుదల కోసం ప్రయత్నిస్తున్నారు. గత రెండు రోజులుగా హైదరాబాద్‌లో ఉన్న ఎంఎల్‌ఎ ముఖ్యమంత్రిని కలిసి నియోజకవర్గంలోని సమస్యలను వివరించగా కోట్లరూపాయిలను మంజూరు చేయడం జరిగినది.అందులో భాగంగా ములకలపల్లి మండలంలోని మేజర్ సమస్య అయిన పాములేరు వాగు రిటైనింగ్ వాల్ నిర్మాణానికి నిధులు మంజూరు కావడం జరిగినది.మండలానికి నిధులు మంజూరు కావడం పట్ల మండల బిఆర్‌ఎస్ నాయకులతో పాటు మండల ప్రజలు ముఖ్యమంత్రికి,ఎంఎల్‌ఎ కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.