Monday, November 25, 2024

కోటి కుటుంబాలకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి సూర్యోదయ యోజన ద్వారా దేశంలో కోటి కుటుంబాలకు ప్రతి నెలా 300 యూనిట్ల ద్వారా ఉచిత విద్యుత్ లభిస్తుందని, వారు ఏటా రూ.18,000 ఆదా చేసుకోవడానికి ఇది తోడ్పడుఉతందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. గత నెల అయోధ్యలో రామమందిర ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొని తిరిగి వచ్చిన వెంటనే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కోటి కుటుంబాల ఇళ్లపై సోలార్ సిస్టమ్‌లను ఏర్పాటు చేయాలన్న లక్షంతో ప్రధానమంత్రి సూర్యోదయ యోజనను ప్రారంభించాలని తమ ప్రభుత్వం నిర్ణయించినట్లు ట్విట్టర్( ఎక్స్) పోస్టులో తెలియజేసిన విషయం తెలిసిందే. దానికి కొనసాగింపుగా ఈ పథకాన్ని ప్రకటించారు. ఇళ్ల పైకప్పులపై సోలార్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం ద్వారా కోటి కుటుంబాలకు ప్రతినెలా 300 యూనిట్ల దాకా ఉచిత విద్యుత్ లభిస్తుందని నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో తెలియజేశారు.

అయోధ్యలో రామమందిర ప్రాణప్రతిష్ఠ జరిగిన చారిత్రక రోజున ప్రధాని తీసుకున్న నిర్ణయం మేరకు ఈ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు ఆమె చెప్పారు.ఈ పథకం ప్రయోజనాలను ఆమె వివరిస్తూ ఇళ్లకు ఉచిత సౌర విద్యుత్ ద్వారా, అలాగే మిగులు విద్యుత్‌ను పంపిణీ సంస్థలకు విక్రయించడం ద్వారాకోటి కుటుంబాలకు ఏటా రూ.15,000నుంచి 18,000దాకా ఆదా అవుతుందని చెప్పారు.ఈ విద్యుత్ వాహనాల చార్జింగ్‌కు కూడా ఈ పథకం తోడ్పడుతుందన్నారు. భారీ స్థాయిలో విద్యుత్ చార్జింగ్ కేంద్రాల ఏర్పాటుకు ఉపకరిస్తుంది. విద్యుత్ చార్జింగ్ కేంద్రాల ఏర్పాటుతో పాటుగా విద్యుత్ చార్జింగ్ మౌలిక వసతుల కల్పన ,విద్యుత్ చార్జర్ల తయారీ, ఇన్‌స్టలేషన్, ఆయా కేంద్రాల నిర్వహణ, సాంకేతిక నైపుణ్యంతో పాటు యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పనకు తోడ్పడుతుందని ఆమె చెప్పారు. 2070నాటికి విద్యుత్ తయారీ, వినియోగంలో పూర్తిస్థాయిలో కర్బన ఉద్గారాల నియంత్రణకు దోహదపడుతుందని తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News