Wednesday, January 22, 2025

కోటి రూపాయల కారు బుగ్గి

- Advertisement -
- Advertisement -

1-Crore Mercedes Crashes Near Delhi, Catches Fire

న్యూఢిల్లీ : కోటీరూపాయల మెర్సీడస్ కారు అదుపు తప్పి మంటలు చెలరేగి ధ్వంసం అయింది. ఈ ఘటన ఢిల్లీకి సమీపంలోని నోయిడా రోడ్లపై జరిగింది. అక్కడి ఎఫ్1 రేసింగ్ ట్రాక్ వద్ద మంటలు చెలరేగిన ఈ మెర్సిడెస్ సిఎల్‌ఎ కారు దృశ్యాలు సెల్‌ఫోన్ల కెమెరాల ద్వారా సోషల్ మీడియాలో చోటుచేసుకున్నాయి. తాము సురక్షితంగా ఉన్నామని కారులోని వారు తెలిపారు. ఈ విలాసవంతపు కారు ఢిల్లీనివాసం నిఖిల్ చక్రవర్తిది. ఆయన ప్రమాద ఘటన దశలో కారులోనే ఉన్నాడు. దేశంలోని ఏకైక ఫార్మూలా 1 రేస్ ట్రాక్ రూట్‌లోకి విలాసవంతపు కార్లు అనేకం వస్తుంటాయి. వీరి కారు వెళ్లుతుండగా రోడ్డుపై ఓ జంతువు ఎదురొచ్చింది. దీనితో కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొంది. ఈ క్రమంలో కారులో మంటలు చెలరేగాయి. అద్దాలు పగులగొట్టుకుని కారులోని వారు బయటకు పరుగులు తీశారు . దీనితో ప్రాణాపాయం లేకుండాపోయింది. కారు తగులబడింది. తాను పదిరోజుల క్రితమే కారు కొన్నానని, ఇప్పుడు తగులబడిపోయిందని దీని ఓనర్ నిఖిల్ చౌదరి వాపొయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News