భద్రాద్రికొత్తగూడెం: జిల్లాలోని జూలూరుపాడు మండల పరిధిలో అదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. నల్లొండ జిల్లా నకిరేకల్‌కు చెందిన డోర్నాల సురేందర్ కుంటుంబ సభ్యులు తన సొంత కారులో డ్రైవర్ మసరం బాలరాజుని తీసుకుని భద్రాచలం రాములవారి దర్శనానికి అర్ధరాత్రి బయలుదేరారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల పరిధిలోని సీతారామ ప్రాజెక్టు కార్యాలయం సమీపంలోకి రాగానే కొత్తగూడెం వైపు నుండి వస్తున్న ఆర్టీసీ బస్సు, కారు ఎదురుగా ఢీకొనడంతో కారు డ్రైవర్ మసరం బాలరాసు (32) అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. కారులో ప్రయాణిస్తున్న మరో నలుగురు డోర్నాల సురేందర్, రావిరాల వెంకటేశ్వర్లు, పొట్టబత్తుల నరసయ్య అతని భార్య ఆండాళ్లులకు తీవ్రగాయాలు కావడంతో హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సై శ్రీకాంత్, సిబ్బంది 108 వాహనంలో కొత్తగూడెం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో ఖమ్మం ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. మృతుడు డ్రైవర్ బాలరాజు తల్లి పార్వతమ్మ ఫిర్యాదు మేరకు స్థానిక ఎస్సై శ్రీకాంత్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
1 dead 4 injured in road accident in bhadradri kothagudem