Sunday, January 19, 2025

పూర్వ బంగారు గనిలో చిక్కుకుని ఒకరి మృతి

- Advertisement -
- Advertisement -

కొలరాడోలోని ఒకప్పటి బంగారు గనిలో పర్యాటకులు సందర్శించడానికి అనుమతి ఉన్న ప్రాంతంలో లిఫ్టు పనిచేయకపోవడంతో ఒక వ్యక్తి మరణించగా మరో 12 మంది గనిలో చిక్కుకుపోయారు. ఆరుగంటలపాటు తీవ్రంగా శ్రమించిన అధికారులు దాదాపు 1,000 అడుగుల లోతున భూగర్భంలో చిక్కుకున్న సందర్శకులను రక్షించారు. ప్రస్తుతం పర్యాటక ప్రదేశంగా రూపొందిన కొలరాడో బంగారు గనిలోని భూగర్భంలో చిక్కుకుపోయిన సందర్శకులను రక్షించడంలో కొంత జాప్యం జరగడంతో వారికి తాగునీరు, కమ్యూనికేషన్ పరికరాలను అధికారులు పంపించారు. క్రిప్పల్ క్రీక్ పట్టణానికి సమీపంలో ఉన్న మొల్లీ క్యాథ్‌లీన్ బంగారు గనిలో లిఫ్టు హఠాత్తుగా మొరాయించడంతో

భూగర్భంలో ఉన్న సందర్శకులు లోపలే చిక్కుకుపోయారని టెల్లెర్ కౌంటీ షరీఫ్ జేసన్ మైక్‌సెల్ తెలిపారు.. అయితే గని కూలిపోలేదని ఆయన స్పష్టం చేశారు. 1800 శతకంలో ప్రారంభమైన కొలరాడో బంగారు గని 1960వ దశకంలో మూతపడింది. అయితే ఇప్పటికీ పర్యాటకులను లోపలకు అనుమతిస్తున్నారు. గంటపాటు ఉండే టూర్‌లో పర్యాటకులను భూగర్భంలో 100 అంతస్తుల వరకు తీసుకెళతారని గనికి చెందిన వెబ్‌సైట్ పేర్కొంది. గనిలోపల రాళ్లకు అంటిన బంగారు రేణువులను సందర్శకులు ఇప్పటికీ చూడవచ్చు. అలాగే లోపల ట్రామ్‌లో గనిని చుట్టి చూడవచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News