Thursday, January 23, 2025

ఫ్లైఓవర్‌పై నుంచి పడి బైకిస్టు మృతి..

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః అధిక వేగం వల్ల బైక్ అదుపు తప్పి ఫ్లై ఓవర్‌పై నుంచి కింద పడడంతో ఓ యువకుడు మృతిచెందిన సంఘటన సైబరాబాద్ గచ్చిబౌలి, బయోడైవర్సిటీ వద్ద ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…గచ్చిబౌలిలో నివాసంటున్న మధు(25), మరో యువకుడు కలిసి బైక్‌పై వెళ్తున్నారు. అతివేగంగా బైక్‌పై వెళ్లడంతో అదుతప్పి ఫ్లైఓవర్ డివైడర్‌ను ఢీకొట్టారు. దీంతో పైన ఉన్న ఫ్లైఓవర్ నుంచి కింద ఉన్న ఫ్లైఓవర్‌పై పడిపోయారు. దీంతో మధు అక్కడికక్కడే మృతిచెందగా మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే పోలీసులు గాయపడిన యువకుడిని ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు రాయదుర్గం పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News