Friday, November 15, 2024

కరోనా సోకిన ప్రతి ఎనిమిది మందిలో ఒకరికి లాంగ్​ కోవిడ్​ లక్షణాలు

- Advertisement -
- Advertisement -

 

Covid 19

ఆమ్ స్టర్ డ్యామ్:  కరోనా మహమ్మారి.. కొద్ది రోజులుగా మళ్లీ ప్రతాపం చూపుతోంది. అయితే చాలా మందిలో కరోనా లక్షణాలు బయటికి పెద్దగా కనిపించకపోయినా, శరీరం మాత్రం బలహీనం అవుతోందని, లాంగ్ కోవిడ్ లక్షణాలు చాలా కాలం కొనసాగుతున్నాయని నెదర్లాండ్స్ కు చెందిన శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కరోనా బారిన పడిన ప్రతి 8 మందిలో ఒకరిలో ఈ వ్యాధి దీర్ఘకాలిక ప్రభావం చూపుతోందని.. శ్వాసకోస సమస్యలు, నీరసం, రుచి, వాసన శక్తి తగ్గిపోవడం లక్షణాల్లో అన్నీగానీ, కనీసం ఒకట్రెండు గానీ చాలాకాలం కొనసాగుతున్నాయని అంటున్నారు. సుదీర్ఘంగా, విస్తృత స్థాయిలో జరిపిన అధ్యయనం.. కరోనాకు సంబంధించి ఇప్పటివరకు జరిగిన అన్ని సర్వేల్లో సమగ్రమైనదని పేర్కొంటున్నారు. ‘లాన్సెట్’ జర్నల్ లో ఈ అధ్యయనానికి సంబంధించిన వివరాలు ప్రచురితమయ్యాయి.

నెదర్లాండ్స్‌లోని ఉత్తర ప్రాంతంలో నిర్వహించిన ఈ అధ్యయనంలో 76,422 మంది పాల్గొనేవారి నుండి మార్చి 2020 చివరి నుండి 2021 ఆగస్టు ప్రారంభం వరకు సేకరించిన డేటాను ఉపయోగించారు. అప్పటి నుండి, వ్యాధినిరోధకత , కొత్త ఔషధ చికిత్సల వాడకం ద్వారా దీర్ఘకాల కోవిడ్ ప్రమాదాలు తగ్గించబడ్డాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News