Friday, November 22, 2024

ప్రపంచంలో ప్రతి 4 కరోనా మరణాల్లో 1 భారత్ లోనే

- Advertisement -
- Advertisement -

1 in every 4 corona deaths in the world is in India

ప్రపంచ ఆరోగ్య సంస్థ వారాంతపు నివేదిక వెల్లడి

జెనీవా : గత వారం ప్రపంచంలో నమోదైన మొత్తం కేసుల్లో సగం భారత్ లోనే ఉన్నట్టు బయల్పడడం విస్మయం కలిగిస్తోంది. గత కొన్ని వారాలుగా కరోనా ఉప్పెనతో భారత్ విలవిల్లాడుతోంది. రోజూ అత్యధిక సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. అదే విధంగా మరణాలు సంభవిస్తున్నాయి. ఈ వివరాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. గత వారంలో ప్రపంచంలో సంభవించిన ప్రతి నాలుగు కరోనా మరణాల్లో ఒకటి భారత్ లోనే ఉందని విశ్లేషించింది. ఆసియాలో నమోదౌతున్న మొత్తం కేసుల్లో 90 శాతం కేవలం భారత్ లోనే నమోదవుతుండడం గమనార్హం.

ప్రపంచ వ్యాప్తంగా నమోదౌతున్న వాటిలో ఇది 46 శాతంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేసింది. ప్రపంచ వ్యాప్తంగా సంభవిస్తున్న మొత్తం కరోనా మరణాల్లో 25 శాతం భారత్ లోనే ఉంటున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ గతవారపు నివేదికలో వెల్లడించింది. ఇక ఇప్పటివరకు అత్యధిక కరోనా మరణాలు (5 లక్షల 78 వేలు) అమెరికాలో చోటు చేసుకోగా, బ్రెజిల్ (4 లక్షల 11వేలు) రెండో స్థానంలో ఉంది. భారత్‌లో రోజువారీ పాజిటివ్ కేసులు సంఖ్య దాదాపు 4 లక్షల వరకు ఉంటోంది. అలాగే రోజూ మూడున్నర వేల మంది చనిపోతున్నారు. కేంద్ర ఆరోగ్యశాఖ వివరాల ప్రకారం భారత్‌లో కొవిడ్ కేసుల సంఖ్య 2 కోట్లు దాటాయి. మరణాలు మొత్తం 2 లక్షల 26 వేలకు చేరుకున్నాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News