Wednesday, January 22, 2025

కరెంట్ కోతలపై నిరసన.. పోలీస్ కాల్పులకు ఒకరు బలి

- Advertisement -
- Advertisement -

పాట్నా : బీహార్ లోని కటిహార్ జిల్లాలో కరెంట్ కోతలకు వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారింది. నిరసన కారులపై పోలీస్‌లు జరిపిన కాల్పుల్లో ఒకరు ప్రాణాలు కోల్పోగా మరికొందరు గాయపడ్డారు. కటిహార్ లోని బార్సోయి ప్రాంతంలో కరెంట్ కోతలు , విద్యుత్ టారిఫ్ లను నిరసిస్తూ గ్రామస్థులు ఆందోళనకు దిగారు. స్థానిక విద్యుత్ కార్యాలయాన్ని ముట్టడించారు.

ఆఫీస్ పైకి రాళ్లు విసిరి, అక్కడి సామగ్రిని ధ్వంసం చేశారు. ఆందోళన కారులను అదుపు చేసేందుకు పోలీస్‌లు మొదట లాఠీ ఛార్జ్ చేశారు. దీంతో పరిస్థితి తీవ్రంగా మారడంతో పోలీస్‌లు, గ్రామస్థుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు కాల్పులు జరిపారు. ఈ సంఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోగా, మరికొందరు గాయపడ్డారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News