Monday, December 23, 2024

రీల్స్ చేస్తే రూ. లక్ష బహుమతి.. రాష్ట్ర ప్రభుత్వం బంపర్ ఆఫర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఇన్‌స్టాగ్రామ్, ఎఫ్‌బీ రీల్స్, యూట్యూబ్ షార్ట్‌లు, చేసే వారికి తెలంగాణ ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. ప్రభుత్వం చెప్పిన కంటెంట్ పై హైదరాబాద్ ప్రత్యేకతలపై వినూత్నంగా రీల్స్ చేసి మెప్పిస్తే లక్షరూపాయలు గెలుచుకోవచ్చని వెల్లడించింది. హ్యాపెనింగ్ హైదరాబాద్ షార్ట్ వీడియో కాంటెస్ట్ ను తెలంగాణ రాష్ట్ర శాఖ డిజిటల్ మీడియా ప్రకటించింది. హైదరాబాద్‌లో అద్భుతమైన ప్రదేశాలను ఎంపిక చేసుకుని రీల్స్ చేయాలని సూచించింది. హైదరాబాద్ ప్రజల జీవనానికి ఎంత అనుకూలంగా ఉంటుందో నిరూపించేలా రీల్స్ చేయాలని నిబంధన పెట్టింది.

తమ సోషల్ మీడియాలో పోస్టు చేసుకుని @DigitalMediaTS కు ట్యాగ్ చేయాలి. ఈ రీల్స్ కాంటెస్ట్‌లో భాగంగా యూట్యూబ్, ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రాం, ట్విట్టర్‌లో తమ షార్ట్ వీడియోస్ పోస్ట్ చేసే అవకాశం కల్పించింది. హైదరాబాద్ పై రీల్ చేసిన కంటెంట్ జనవరి ఒకటి 2023 తర్వాత చేసినదై ఉండాలి. ఈ రీల్ 60 సెకండ్లు మించకూడదు. సోషల్ మీడియాలో పోస్ట్ చేయడానికి అనుకూలంగా ఉండాలి. 8 ఏళ్ల పైబడిన వారు రీల్స్ చేసి పంపొచ్చు. ఈ కాంటెస్ట్ కి సంబంధించి రీల్స్ ఏప్రిల్ 30లోపు సోషల్ మీడియా ప్లాట్ ఫాంలలో పోస్టు చేయాలి. మే రెండవ వారంలో విజేతలను వెల్లడిస్తారు. ఈ పోటీలో పాల్గొనేవారు పూర్తి సమాచారం కోసం https://it.telangana.gov.in/contest/ లాగిన్ అయి తెలుసుకోవచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News