ట్రంప్ దెబ్బకు ఇరాన్ కరెన్సీ కుదేలు
టెహరాన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలతో ఇరాన్ ఆర్థికంగా కుదేలు అవుతోంది. ఇరాన్ కరెన్సీ రియాల భారీగా పతనమైంద. డాలర్‌తో పోలిస్తే రియాల్ విలువ ఏకంగా 1043000కు పడిపోయింది. మున్ముందు ఇది మరింత క్షీణించే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. ట్రంప్ రెండవ సారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రియాల్‌పై ఒత్తిడి విపరీతంగా పెరుగుతోంది. అమెరికా, ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలే ఇందుకు కారణం.
ట్రంప్ తొలిసారి అధికారంలోకి వచ్చిన వెంటనే ఇరాన్‌పై ఆర్థిక ఆంక్షలు విధించారు. అంతే కాదు. బరాక్ ఒబామా హయాంలో కుదిరిన అణు ఒప్పందం నుంచి కూడా ట్రంప్ వైదొలిగారు. ట్రంప్ రెండవ విడత అధికారంలోకి వచ్చిన తరువాత కూడా అదే విధమైన ఒత్తిడి కొనసాగిస్తున్నారు. ఆయన ఇటీవల ఇరాన్‌పై భారీగా ఆంక్షలు విధించారు. ఇరాన్ నుంచి చమురు కొనుగోలు చేస్తున్న సంస్థలను ట్రంప్ లక్షంగా చేసుకున్నారు. అణు ఒప్పందంపై నేరుగా చర్చలకు రావాలని కోరుతూ ట్రంప్ ఇటీవల రాసిన లేఖపై ఇరాన్ సానుకూలంగా స్పందించలేదు. దీనితో ఇరాన్‌పై బాంబులు వేస్తామని ట్రంప్ ఒక ఇంటర్వూలో హెచ్చరించారు.