Wednesday, January 22, 2025

“నోటా”ను వినియోగించుకున్న ఓటర్లు తక్కువ మందే

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఆదివారం నాలుగు రాష్ట్రాల్లోని మూడు రాష్ట్రాల్లో జరిగిన ఓట్ల లెక్కింపులో “నోటా” ( నన్ ఆఫ్ ది ఎబోవ్) అవకాశాన్ని ఒకశాతం కంటే తక్కువ మంది ఓటర్లు వినియోగించుకున్నట్టు బయటపడింది. నోటా అంటే “పైవారెవరూ ఇష్టం లేదు” అని ఓటరు తన అభిప్రాయం వ్యక్తం చేయడం. మొత్తం ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఆదివారం ఓట్ల లెక్కింపు జరిగింది. మిజోరంలో ఓట్ల లెక్కింపు సోమవారం జరుగుతుంది. మధ్యప్రదేశ్‌లో మొత్తం 77.15 శాతం పోలింగ్ జరగ్గా, 0.99 శాతం ఓటర్లు నోటా అవకాశాన్ని వినియోగించుకున్నారు. ఛత్తీస్‌గఢ్ లో 76.3 శాతం ఓటింగ్ జరగ్గా, 1.29 శాతం మంది , తెలంగాణలో 71.14 శాతం ఓట్లు పోలింగ్ కాగా, 0.74 శాతం మంది , రాజస్థాన్‌లో 74.62 శాతం ఓట్లు పోలింగ్ కాగా, 0.96 శాతం మంది నోటా వినియోగించుకున్నారు.

యాక్సిస్ ఆఫ్ మై ఇండియాకు చెందిన ప్రదీప్ గుప్తా ఈ సందర్భంగా పిటిఐతో మాట్లాడుతూ నోటా వినియోగం .01 శాతం నుంచి 2 శాతం వరకు జరిగిందని తెలిపారు. ఏదైనా కొత్త విధానం అమలు లోకి తీసుకొచ్చేటప్పుడు దాని నిర్వహణ ఫలితంపై ప్రభావం ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. ఏ అభ్యర్థి అయినా గరిష్ఠస్థాయిలో ఓట్లు పొందితే విజేతగా ప్రకటిస్తారని, అలాగే ఓటర్లు తిరస్కరించిన వారిని పోలింగ్‌కు పరిగణించడం లేదని, అలాంటి పరిస్థితుల్లో నోటా అనేది ఎలా చెల్లుతుందని ప్రశ్నించారు. ప్రజలు ఈ నోటాను సరిగ్గా వినియోగించుకుంటే ఫలితం ఉంటుంది తప్ప లేకుంటే నామమాత్రంగా మిగిలిపోతుందని వ్యాఖ్యానించారు. నోటా ప్రభావాన్ని వాస్తవంగా పరిగణన లోకి తీసుకుంటే , ఎక్కువ మంది ఓటర్లు ఈ అవకాశాన్ని వినియోగించుకుంటే నోటా ను బట్టి విజేతను ప్రకటించవచ్చని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News