- Advertisement -
హైదరాబాద్: హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. శనివారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 7 గంటల వరకు జరగనుంది. ఓటేసేందుకు ప్రజలు భారీగా పోలింగ్ కేంద్రాలకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద క్యూ కట్టారు. దీంతో హుజూరాబాద్ లో ఉదయం 9 గంటలకు వరకు 10.50 శాతం పోలింగ్ నమోదైంది. కాగా, ఇల్లంతకుంటలో ఒక ఈవిఎంలో సాంకేతిక లోపం తలెత్తిందని కరీంనగర్ సిపి తెలిపారు. దీంతో ఓటర్లు ఓటు వేయకుండా తిరిగి వెళ్లిపోతున్నారు. ఇప్పటివరకు ఎక్కడ అవాంఛనీయ ఘటనలు జరగలేదని సిపి చెప్పారు. కమలాపూర్ మండలంలోని గుండెడు గ్రామంలో మహిళలు గ్యాస్ సిలిండర్ కి దండం పెట్టి ఓటు వేయడానికి బయల్దేరుతున్నారు.
10.50% voting so far in Huzurabad
- Advertisement -