కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లోని బీర్‌భూమ్‌కు చెందిన రామ్‌పుర్హత్‌లోని బగుటి గ్రామంలో పంచాయతీ నాయకుడు భడు షేఖ్ సోమవారం రాత్రి హత్యకు గురయ్యాక కనీసం 10 మందిని సజీవంగా తగులబెట్టారు. రెచ్చి పోయిన జనం అనేక ఇళ్లకు నిప్పంటిచడంతో దాదాపు 10 మంది చనిపోయారు. బడు షేఖ్ బరోసల్ గ్రామంలో పంచాయతీ కార్యకర్త. అతడు నేషనల్ హైవే60 వద్ద ఓ దుకాణం వద్ద ఉండగా అతడిపై బాంబులతో దాడి జరిగింది. అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లినప్పటికీ చనిపోయాడు. అతడు పేరుపడ్డ నాయకుడు కావడంతో జనం కొందరి ఇళ్లపై దాడి చేసింది. కాగా షేఖ్ హత్య కేసులో పోలీసులు ఇప్పటి వరకు ఒకరిని అరెస్టు చేశారు. సోమవారం రాత్రి ఓ డజనుకుపైగా ఇళ్లకు నిప్పంటించారని అగ్నిమాపక అధికారులు తెలిపారు. వారు మంటలను అదుపులోకి తేడానికి ప్రయత్నించినప్పుడు జనం అడ్డుకున్నారని సమాచారం. కనీసం పది మంది కాలిపోయారని అగ్నిమాపక అధికారులు తెలిపారు. శరీరాలు పూర్తిగా కాలిపోయింనందున ఎవరివవి అన్నది గుర్తించలేకపోయామని కూడా వారు చెప్పారు. ఒకే ఇంట్లో ఏడు భౌతిక కాయాలను గుర్తించామని వారు తెలిపారు. వాటిని రామ్‌పుర్హత్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్‌కు పంపారు.
పశ్చిమ బెంగాల్‌లో పది మంది సజీవ దహనం
- Advertisement -
- Advertisement -
- Advertisement -