Wednesday, January 22, 2025

పాకిస్థాన్‌లో మునిగిన పడవ: పది మంది విద్యార్థులు జలసమాధి

- Advertisement -
- Advertisement -

 

ఇస్లామాబాద్: పాకిస్థాన్ దేశంలో ఖైబర్ పొఖ్తుంఖ్వా ప్రాంతంలో ఘోర పడవ ప్రమాదం చోటుచేసుకుంది. తాండా జలాశయంలో ఆదివారం సాయంత్రం పడవ మునిగి పది మంది పిల్లలు మృతి చెందారు. కోహట్ జిల్లా కమీషనర్ మహమూద్ అస్లామ్ మీడియాతో మాట్లాడారు. ముస్లిముల ధార్మిక పాఠశాలకు చెందిన 50 మంది విద్యార్థులు విహార యాత్ర కోసం తాండ జలాశయానికి వెళ్లారన్నారు. 25 మంది విద్యార్ధులు జలాశయంలో బోటులో విహారిస్తుండగా ఒక్కసారిగా బోటు మునిగిపోవడంతో 10 మంది విద్యార్థులు జల సమాధయ్యారని వివరించారు. గల్లంతైన ఎనిమిది మంది కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారని తీవ్రంగా గాయపడిన ఏడుగురిని ఆస్పత్రికి తరలించామని వెల్లడించారు. మృతులు ఏడు సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News