Thursday, January 23, 2025

బీహార్‌లో పడవ ప్రమాదం: 10 మంది పిల్లల గల్లంతు

- Advertisement -
- Advertisement -

పాట్నా: ముజఫర్‌పూర్ జిల్లాలోని బాగమతి నదిలో గురువారం పడవ మునిగిపోవడంతో 10 మంది పిల్లలు గల్లంతయ్యారు. పడవలో 30 మంది పిల్లలున్నారని, వీరిలో 20 మందిని స్థానికులు రక్షించారని అధికారులు తెలిపారు. బాగమతి నది ఒడ్డున ఉన్న మధుపూర్ పట్టి ఘాట్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

సహాయక చర్యలు చేపట్టినట్లు పడవ ప్రమాదం ఘటనపై విలేకరులతో మాట్లాడుతూ బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తెలిపారు. అత్యవసర సహాయం అందచేయవలసిందిగా జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించినట్లు ఆయన తెలిపారు. బాధిత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని ఆయన హామీ ఇచ్చారు. జిల్లాలో ప్రస్తుతం అమలులో ఉన్న వివిధ ప్రాజెక్టులను సమీఓఇంచడానికి ముఖ్యమంత్రి ముజఫర్‌పూర్ వచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News