- Advertisement -
అనారోగ్య సమస్యలతో విద్యార్థి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన సిరిసిల్ల జిల్లాలోని కోనరావుపేట మండలం సుద్దాల గ్రామంలో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే..పోలీసులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. సుద్దాల గ్రామానికి చెందిన అలువాల శ్రీనివాస్- అంజవ్వా దంపతుల చిన్న కొడుకు వెంకటేష్ ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. కాగా ఇంట్లో ఎవరూ లేని సమయంలో వెంకటేష్ ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
- Advertisement -