ఉత్తరకాశీ: మంచు తుపాను ధాటికి పదిమంది పర్వతారోహకులు మృతి చెందారు. ద్రౌపది కా డాండా శిఖరం వద్ద హిమపాతం కారణంగా వీరు ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటనపై నెహ్రూ ఆఫ్ కల్నల్ అమిత్ బిస్త్ మాట్లాడుతూ..ఎన్‌ఐఎంకు చెందిన 34మంది ట్రైనీ పర్వతారోహకులు, సిబ్బంది పర్వత శిఖరం నుంచి తిరిగి వచ్చే సమయంలో భారీ హిమపాతంలో చిక్కుకుపోయారని తెలిపారు. మంగళవారం ఉదయం 8.45 సమయంలో మంచు తుపాను చెలరేగింది. మృతుల్లో నలుగురు మృతదేహాలు లభ్యమయ్యాయన్నారు. ఉత్తరకాశీ నిర్వహణ శాఖ అధికారి దేవేంద్ర పట్వాల్ మాట్లాడుతూ తమ సిబ్బంది హిమపాతంలో చిక్కుకున్న ఎనిమిదిమందిని రక్షించారని తెలిపారు. కాగా బాధితులను రక్షించేందుకు రాష్ట్ర విపత్తు నిర్వహణ దళాలు, ఇండో టిబెట్ బోర్డర్ పోలీసులు, ఎన్‌ఐఎం పర్వతారోహక జట్టు సంయుక్తంగా చర్యలు చేపట్టాయని..ఉత్తరాఖండ్ సిఎం ధామి ట్వీట్‌లో తెలిపారు. రక్షణ చర్యలు వేగవంతం చేసేందుకు సైనిక సేవలను వినియోగించాల్సిందిగా రక్షణశాఖ మంత్రి ఫోన్ ద్వారా తెలిపారని సిఎం పుష్కర్‌సింగ్ వెల్లడించారు.
ఉత్తరాఖండ్‌లో 10మంది పర్వతారోహకుల మృతి
- Advertisement -
- Advertisement -
- Advertisement -