చండీగఢ్: పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీని పునర్వవస్థీకరించనున్నట్లు వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్‌కు మద్దతుగా 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆదివారం ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు. పిసిసి అధ్యక్షుని ఎంపికలలో అమరీందర్ సింగ్ మాటను కాదని పార్టీ అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకోరాదని వారు తమ ప్రకటనలో కోరారు.
మాజీ మంత్రి నవజోత్ సింగ్ సిద్ధూ ప్రజాదరణ ఉన్న నాయకుడే కాక పార్టీకి ఆయన ఒక గొప్ప ఆస్తి అనడంలో ఎటువంటి సందేహం లేదని, అయితే బహిరంగంగా తన సొంత పార్టీని, ప్రభుత్వాన్ని విమర్శించి పార్టీ కార్యకర్తలలో చిచ్చుపెట్టి పార్టీని బలహీనపరిచారని వారు పేర్కొన్నారు. అమరీందర్ సింగ్ నిర్విరామ కృషి వల్లనే కాంగ్రెస్ పార్టీ పంజాబ్‌లో బలంగా ఉండని, రాష్ట్రంలోని అన్ని వర్గాలలో ఆయనంటే ఎనలేని గౌరవముందని వారు తెలిపారు. 2004 జలాల ఒప్పంద చట్టాన్ని రద్దు చేస్తూ ఆయన అసెంబ్లీలో బిల్లు ఆమోదించి రైతుల కోసం తన ముఖ్యమంత్రి పదవిని కూడా త్యాగం చేయడానికి సిద్ధపడ్డారని వారు గుర్తు చేశారు. పంజాబ్ పిసిసి అధ్యక్షుని ఎంపిక పార్టీ అధిష్టానం విచక్షణాధికారమే అయినప్పటికీ బహిరంగంగా సొంత పార్టీని విమర్శించి పార్టీని బలహీనపరచిన వ్యక్తిగా సిద్ధూను వారు అభివర్ణించారు.
పంజాబ్ సిఎంకు మద్దతుగా 10మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంయుక్త ప్రకటన
- Advertisement -
- Advertisement -
- Advertisement -