Thursday, December 26, 2024

కోల్‌కతా ఆర్‌జి కర్ ఆస్పత్రి..10 మంది డాక్టర్ల బహిష్కరణ

- Advertisement -
- Advertisement -

కోల్‌కతా ఆర్‌జి కర్ హాస్పిటల్‌లో 10 మంది డాక్టర్లపై బహిష్కరణ వేటు పడింది. ఆస్పత్రిలో బెదిరింపులు, వేధింపులు , ర్యాగింగ్ , మనీలాండరింగ్ తదితర నేరాలకు పాల్పడినట్టు వీరిపై ఆరోపణలు రావడంతో హాస్పిటల్ అంతర్గత కౌన్సిల్ ఈ నిర్ణయం తీసుకుంది. సదరు డాక్టర్లను కాలేజీ హాస్టల్ నుంచి శాశ్వతంగా బహిష్కరించాలని , వారి ఇళ్లకు నోటీసులు పంపాలని సమష్టిగా నిర్ణయించినట్టు సంబంధిత అధికారులు వెల్లడించారు. పది మంది వైద్యుల బహిష్కరణతోపాటు, ఇంటర్న్‌లు, విద్యార్థులు, హౌస్ సిబ్బందితో సహామొత్తం 59 మంది వ్యక్తులను తాత్కాలికంగా సస్పెండ్ చేసినట్టు అధికారులు తెలిపారు. బహిష్కరణ వేటు పడిన డాక్టర్లలో సౌరభ్ పాల్, ఆశిష్ పాండే (సిబిఐ అరెస్ట్ చేసింది), అభిషేక్ సేన్, ఆయుశ్రీదాపా, నిర్జస్ బార్చీ, సరీఫ్ హసన్, నీలాగ్ని దేబ్నాద్, అమరేంద్రసింగ్, సత్పాల్ సింగ్, తన్వీర్ అహ్మద్ కాజీలు ఉన్నారు.

ఈ డాక్టర్లు తమ హాస్టల్‌ను ఖాళీ చేయడానికి అధికారులు 72 గంటల సమయం ఇచ్చారు. మరోవైపు బహిష్కరణకు గురైన డాక్టర్ల పేర్లు రాష్ట్ర వైద్య మండలికి పంపిస్తామని అధికారులు తెలిపారు. ఆ డాక్టర్ల మెడికల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్‌లను సమీక్షించవచ్చు. లేదా రద్దు చేసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ఈ ఆర్జీ కర్ ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్‌పై జరిగిన హత్యాచారం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. బాధితురాలికి న్యాయం చేయాలని డాక్టర్లకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ జూనియర్ డాక్టర్లు నిరసన కొనసాగిస్తున్నారు. డాక్టర్‌పై హత్యాచార సంఘటన తరువాత రాష్ట్రంలో అనేక ప్రభుత్వ ఆస్పత్రుల్లో బెదిరింపు సంస్కృతి కొనసాగుతోందన్న ఆరోపణలు వస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News