- Advertisement -
న్యూఢిల్లీ : ఢిల్లీ విమానాశ్రయంలో ఆదివారం ఉదయం మొత్తం 10 విమానాల మళ్లింపు జరిగింద. రమారమి 100 సర్వీసులు ఆలస్యం అయ్యాయి. కొన్ని సర్వీసులను రద్దు చేశారు. దట్టమైన పొగమంచు వల్ల పారదర్శకత బాగా తక్కువగా ఉండడమే ఇందుకు కారణం. రెండు అంతర్జాతీయ విమానాలతో సహా మొత్తం పది విమానాలను ఆదివారం తెల్లవారు జామున 4.30 గంటలు,
మధ్యాహ్నం 12 గంటల మధ్య జైపూర్‌కు మళ్లించినట్లు అధికారి ఒకరు వెల్లడించారు. అంతర్జాతీయ సర్వీసులతో సహా సుమారు 100 విమానాలు ఆలస్యం అయ్యాయని, అననుకూల వాతావరణం వల్ల కొన్ని సర్వీసుల రద్దు జరిగిందని ఆ అధికారి తెలియజేశారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారరణంగా తమ విమాన సర్వీసులు ఆలస్యం కావచ్చునని విమాన సంస్థలు సోషల్ మీడియాలో వెల్లడించాయి.
- Advertisement -