- Advertisement -
నల్లగొండ: నాగార్జున సాగర్ జలాశయానికి భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. శ్రీశైలం నుంచి భారీగా వరద నీరు వస్తుండటంతో సాగర్ జలాశయం నిండుకుండలా మారింది. ఈ నేపథ్యంలో అధికారులు ప్రాజెక్టు 10 క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్ ప్రాజెక్టు ఇన్ ఫ్లో 1.72 లక్షల క్యూసెక్కులు కాగా.. అంతే క్యూసెక్కులుగా ఔట్ ఫ్లో ఉంది. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 589.70 అడుగుల వద్ద నీటిమట్టం ఉంది. సాగర్ గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా, ప్రస్తుతం నీటి నిల్వ సామర్థ్యం 311.14 టీఎంసీలుగా ఉంది. సాగర్ జలాశయం అందాలను చూసేందుకు భారీగా పర్యాటకులు తరలి వస్తున్నారు.
10 gates Opened at Nagarjuna Sagar Project
- Advertisement -