Thursday, January 23, 2025

గుజరాత్‌లో తులం బంగారం రూ.70 వేలు!

- Advertisement -
- Advertisement -

అహ్మదాబాద్: రిజర్వ్ బ్యాంకు రూ.2000 నోటును చలామణినుంచి ఉపసంహరించుకుందన్న వార్త బైటికి పొక్కగానే దీన్ని సొమ్ము చేసుకోవడానికి గుజరాత్‌లో జ్యుయలరీ షాపుల యజమానుల్లో సరికొత్త ఆలోచన వచ్చింది. రూ.2000 నోట్లతో బంగారం కొనే వారికి ధరలు పెంచేశారని, పది గ్రాముల బంగారం(24 క్యారెట్ల) ధరను రూ.70 వేలుగా నిర్ణయించారని సమాచారం. కాగా గుజరాత్ బులియన్ మార్కెట్లో తులం బంగారం (24 క్యారెట్లు) రూ.60,275 పలికింది.

శుక్రవారం ఆర్‌బిఐ వార్త వెలుగులోకి రాగానే బంగారం కొనుగోలు చేయడానికి వచ్చిన వారి వద్ద రూ.2 వేల నోట్లు 5 10 వరకు ఎక్కువ తీసుకొంటున్నట్లు సమాచారం . అంటే పది గ్రాముల బంగారంమీద రూ.70 వేలు తీసుకొంటున్నారన్న మాట. కిలో వెండి ధర కూడా రూ.80 వేల దాకా పలుకుతున్నది. పెద్ద మొత్తంలో నగదు దాచుకోవడం కన్నా బంగారాన్ని కొనుగోలు చేసి దాచుకోవడం సులువు అయినందునే నల్లధనం ఉన్న వారు బంగారం కొనుగోళ్లకు ఎగబడుతున్నారని విశ్లేషకులు అంటున్నారు. రేపో మాపో దేశంలోని మిగతా నగరాల్లో కూడా ఇదే తీరు రావచని కూడా వారంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News