Sunday, December 22, 2024

గుజరాత్‌లో 10 హోటళ్లకు బాంబు బెదిరింపులు

- Advertisement -
- Advertisement -

నగరంలోని 10 హోటళ్లకు శనివారం ఈమెయిల్స్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఇవన్నీ బూటకపు బెదిరింపులని తేలినట్లు వారు చెప్పారు. మధ్యాహ్నం 12.45 గంటలకు హోటళ్లకు ఈమెయిల్స్ వచ్చాయని, దీంతో పోలీసులు వెంటనే ఆయా హోటళ్ల ప్రాంగణాలలో బాంబు నిర్వీర్య దళాలతో తనికీలు చేపట్టారని స్పెషనల్ ఆపరేషన్ గ్రూపునకు చెందిన పోలీసు ఇన్‌స్పెక్టర్ ఎస్‌ఎం జడేజా తెలిపారు. బెదిరింపు ఈమెయిల్ పంపించిన వ్యక్తి తన పేరు కన్ డెన్ అని తెలిపాడని,

తాను 10 హోటళ్లలో అమర్చిన బంబులు కొన్ని గంటల్లో పేలిపోతాయని చెప్పాడని ఆయన తెలిపారు. అయితే దాదాపు ఐదు గంటలపాటు తనిఖీలు జరిపిన తర్వాత అనుమానాస్పద వస్తువేదీ లభించలేదని ఆయన వివరించారు. సాయంత్రం 6 గంటలకు తనిఖీలు ముగిశాయని, మెయిల్స్ పంపించిన వ్యక్తిని గుర్తించేందుకు దర్యాప్తు కొనసాగుతోందని జడేజా తెలిపారు. మీ హోటల్‌లోని ప్రతి ప్రదేశంలో బాంబులు ఉన్నాయి. మరి కొన్ని గంటల్లో బాంబులు పేలిపోతాయి. అనేక మంది అమాయకుల ప్రాణాలు నేడు పోతాయి. వెంటనే వెళ్లి హోటల్ నుంచి వారిని ఖాళఋ చేయించండి అంటూ ఈమెయిల్ పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News