Monday, December 23, 2024

ఆస్కార్ నామినేషన్స్ బరిలో 10 ఇండియన్ సినిమాలు

- Advertisement -
- Advertisement -

లాస్ ఏంజిల్స్‌లో మార్చిలో అట్టహాసంగా జరగనున్న ఆస్కార్ అకాడమీ అవార్డుల వేడుక కోసం యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఈసారి ఈ వేడుకలో గతం కన్నా ఎక్కువ సంఖ్యలో భారతీయ సినిమాలు నామినేషన్స్ ని దక్కించుకుని పోటీపడుతుండటం ఆసక్తికరంగా మారింది. ఇండియా నుంచి దాదాపు 10 సినిమాలు ఆస్కార్ నామినేషన్స్ కు అర్హత సాధించడం విశేషం. ముందుగా గుజరాతీ మూవీ ఛల్లో షో, ఆ తరువాత రాజమౌళి మూవీ ‘ఆర్‌ఆర్‌ఆర్’ మాత్రమే ఇండియా తరుపున విదేశీ సినిమాల విభాగంలో ఎంట్రీకి ఎంపికయ్యాయి. అయితే తాజాగా ఆ లిస్ట్ 10కి పెరగడం.. అందులో పలు క్రేజీ సినిమాలు వుండటంతో మన వాళ్లు ఆస్కార్ పై భారీగానే ఆశలు పెట్టుకుంటున్నారు.

ఆస్కార్ నామినేషన్స్‌కు ఛల్లో షో, ఆర్‌ఆర్‌ఆర్, వివేక్ అగ్నిహోత్రి రూపొందించిన ‘ది కశ్మీర్ ఫైల్స్’, రిషబ్ శెట్టి నటించి తెరకెక్కించిన ‘కాంతార’, కిచ్చా సుదీప్ నటించిన ‘విక్రాంత్ రోణ’, అలియా భట్ నటించిన ‘గంగూబాయి కతియా వాడీ’, మి వసంతరావ్, తుజ్యా సాథీ కహీ హై, రాకెట్రీ, ఇరవిన్ నిళల్ సినిమాలు అర్హత సాధించాయి. వీటితో పాటు ప్రపంచ వ్యాప్తంగా 301 సినిమాలు ఆస్కార్ పురస్కారం కోసం పోటీపడుతున్నాయి. 95వ ఆస్కార్ అకాడమీ అవార్ట్‌కు నామినేట్ అయిన సినిమాలని ఈనెల 24న ప్రకటించనున్నారు. మార్చి 12న లాస్ ఏంజిల్స్‌లో ఆస్కార్ వేడుక అట్టహాసంగా జరగనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News