Saturday, October 26, 2024

ఇరాన్‌లో ఒకేరోజు వేర్వేరు చోట్ల భీకర దాడులు

- Advertisement -
- Advertisement -

ఇరాన్‌లో శనివారం రెండు భీకర దాడులు జరిగాయి. శనివారం సూర్యోదయం కాకముందే తెల్లవారు జాము నుంచి రాజధాని టెహ్రాన్ లోని సైనిక స్థావరాలను లక్షంగా చేసుకుని వైమానిక దాడులు జరగడంతో ఇరాన్ సైనికులు ఇద్దరు ప్రాణాలను కోల్పోయారు. ఇది జరిగిన తరువాత కొన్ని గంటలకు టెహ్రాన్‌కు 1200 కిమీ దూరంలో ఇరాన్ ఆగ్నేయ ప్రావిన్స్ లోని పోలీస్ కాన్వాయ్‌పై జరిగిన దాడుల్లో 10 మంది పోలీస్ అధికారులు మృతి చెందారు. ఈ దాడికి బాధ్యత తమదేనని ఇజ్రాయెల్ ప్రకటించక పోయినప్పటికీ ఇజ్రాయెలే కారణం కావచ్చన్న అనుమానాలు ఉన్నాయి. మొత్తం మీద ఒకే రోజు రెండు సంఘటనలు జరగడం పశ్చిమాసియా ప్రాంతంలో అలజడి సృష్టిస్తోంది. ఈనెల మొదట్లో ఇజ్రాయెల్‌పై ఇరాన్ సాగించిన దాడులకు ప్రతీకారం గానే ఇరాన్ సైనిక స్థావరాలను లక్షంగా చేసుకుని టెహ్రాన్ లోని సైనిక స్థావరాలపై దాడులకు పాల్పడినట్టు ఇజ్రాయెల్ మిలిటరీ అధికార ప్రతినిధి రియర్ అడ్మిరల్ డేనియల్ హగారీ వీదియో ద్వారా వెల్లడించారు. ఇరాన్‌పై ఇజ్రాయెల్ నేరుగా దాడులకు దిగడం 1980 తరువాత ఇదే మొదటిసారి. టెహ్రాన్‌పై సైనిక స్థావరాలను లక్షంగా చేసుకుని దాదాపు 20 లక్షాలపై దాడులు జరిగాయి.

వంద యుద్ధ విమానాలను ప్రయోగించి ఇజ్రాయెల్ బాంబులు జార విడిచింది. ఇరాన్‌కు చెందిన డ్రోన్ ఫ్యాక్టరీలు, బాలిస్టిక్ క్షిపణి తయారీ, ప్రయోగ కేంద్రాలపై విరుచుకుపడింది. దక్షిణ టెహ్రాన్ లోని ఓ ఫ్యాక్టరీ పూర్తిగా ధ్వంసమైనట్టు తెలుస్తోంది. అయితే ఈ దాడులను ఇరాన్ అంతగా పట్టించుకోలేదు. తమకు నష్టం స్వల్పస్థాయిలోనే ఉందని ఇరాన్ ప్రకటించింది. ఇజ్రాయెల్ ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లేలా రెండుసార్లు ఇరాన్ దాడులకు పాల్పడిందని, దీనికి తగిన మూల్యం తప్పక చెల్లించుకోక తప్పదని ఇజ్రాయెల్ మిలిటరీ ప్రతినిధి తీవ్రంగా హెచ్చరించారు. గాజా స్ట్రిప్‌పైన, లెబనాన్‌పైనే తమ టార్గెట్ తప్ప ప్రజలపై కాదని, కానీ ఇరాన్ ప్రాంతీయంగా ఉద్రిక్తతలు రెచ్చగొట్టేలా హెజ్‌బొల్లా వంటి ఉగ్రవాద సంస్థలను ప్రేరేపిస్తూ దాడులకు పాల్పడుతోందని అడ్మిరల్ డేనియల్ హగారీ ఆరోపించారు. ఈ సందర్భంగా ఇజ్రాయెల్ విడుదల చేసిన ఫోటోలు, వీడియోలో టెల్‌అవీవ్ లో కిర్యా మిలిటరీ స్థావరం లోని మిలిటరీ కమాండ్, కంట్రోల్ సెంటర్‌లో ప్రధాని నెతన్యాహు నల్లజాకెట్ ధరించి మిలిటరీ అధికారులతో సమీక్షలు నిర్వహిస్తుండటం, రక్షణ మంత్రి యోవ్ గాలంట్ మిలిటరీ సలహాదారులు, తదితరులతో చర్చలు జరుపుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.

మరోవైపు ఇరాన్ ఆగ్నేయ ప్రావిన్స్ లోని పోలీస్ కాన్వాయ్‌పై జరిగిన దాడుల్లో 10 మంది పోలీస్ అధికారులు మృతి చెందటాన్ని ఇరాన్ మొదట్లో ఇది దుండగుల చర్యగా పేర్కొన్నా, తరువాత పది మంది పోలీస్ అధికారులు చనిపోయారని ఆ దేశ మీడియా వెల్లడించింది. ఇరాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి ఎస్కండార్ మొమినీ, దీనిపై దర్యాప్తునకు ఆదేశించారు. ఇది పోలీస్ అధికారుల బలిదానంగా వ్యాఖ్యానించారు. అఫ్గానిస్థాన్, బలూచ్ ప్రజల న్యాయవాది గ్రూపునకు చెందిన హల్వేష్ రెండు సెక్యూరిటీ దళాల వాహనాలను టార్గెట్ చేసుకుని ఈ దాడి జరిగిందని పేర్కొన్నారు. ఈ గ్రూపు పంపిన గ్రాఫిక్ ఫోటోలో ట్రక్కు ఫ్రంట్ సీటులో ఇద్దరు పోలీస్ అధికారుల మృతదేహాలు కనిపించాయి. ఈ సెక్యూరిటీ వాహనాల్లో ప్రయాణిస్తున్న పోలీస్‌లంతా బలై పోయారని హల్వేష్ తెలిపారు. బులెట్ల వల్లనే వాహనాలకు తూట్లు పడ్డాయని, మందుగుండు పేలుడు వల్ల కాదని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News