Wednesday, January 22, 2025

బస్సులో10కిలోల బంగారం.. రూ.5 కోట్ల నగదు పట్టివేత

- Advertisement -
- Advertisement -

Rs 5 Crore Worth Gold Seized at Kurnool
మనతెలంగాణ/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లో వేర్వేరు ప్రాంతాలలో బస్సుల్లో తరలిస్తున్న 10కిలోల బంగారం,రూ.5 కోట్ల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి మం డలం కృష్ణవరం టోల్‌ప్లాజా వద్ద పైవేటు బస్సులో తరలిస్తున్న 10 కిలోల 100 గ్రాముల బంగారు నగలు, రూ.5 కోట్ల 6 లక్షల నగదును పోలీసులు పట్టుకున్నారు. విజయవాడ నుంచి శ్రీకాకుళం జిల్లాకు పద్మావతి ట్రావెల్స్‌కు చెందిన ప్రైవేటు బస్సులో వేర్వురుగా బంగారం, నగదును తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. స్వాధీనం చేసుకున్న బంగారానికి సంబంధించి సరైన ఆధారాలు లేకపోవటంతో సీజ్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అలాగే పశ్చిమగోదావరి జిల్లాలోని నల్లజర్ల మ ండలం వీరవల్లి టోల్‌ప్లాజా వద్ద తనిఖీలు చేపట్టిన పోలీసులు రూ.4కోట్లకు పైగా నగదును పట్టుకున్నారు. బస్సు సీట్ల కింద లగేజ్ క్యారియర్‌లో భారీగా నగదు తరలిస్తున్నట్లు గుర్తించారు.బస్సు డ్రైవర్, క్లీనర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. బస్సులో తరలిస్తున్న నగదును పోలీసులు లెక్కించగా రూ.4.76కోట్లు ఉన్నట్లు తేల్చారు. దీంతోపాటు 350 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News