Sunday, December 22, 2024

గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది

- Advertisement -
- Advertisement -

లహ్మదాబాద్: గుజరాత్‌లోని అహ్మదాబాద్-వడోదరా ఎక్స్‌ప్రెస్‌వేలో బుధవారం ఒక ట్రెయిలర్ ట్రక్కును కారు ఢీకొన్న దుర్ఘటనలో 10 మంది మరణించగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ట్రెయిలర్ ట్రక్కును వెనుకనుంచి కారు వేగంగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. వడోదర నుంచి అహ్మదాబాద్‌కు వెళుతున్న కారులో ఉన్న 10 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారని పోలీసులు తెలిపారు.

సమాచారం అందుకున్న వెంటనే అంబులెన్సులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించాయి. కారులోని 8 మంది ఘటనా స్థలంలోనే మరణించగా మరో ఇద్దరు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరనించారని పోలీసులు తెలిపారు. ప్రమాదం కారణంగా ఎక్స్‌ప్రెస్‌వేలో భారీగా ట్రాఫిక్ స్తంభించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News