Thursday, December 19, 2024

ఉత్తరాఖండ్‌లో విషాదం.. లోయలో వాహనం పడి 10మంది మృతి

- Advertisement -
- Advertisement -

పితోర్‌ఘడ్ (ఉత్తరాఖండ్): ఉత్తరాఖండ్ లోని పితోర్‌ఘడ్ జిల్లా లో గురువారం ఉదయం 7.30 గంటల ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించి 10 మంది మృతి చెందారు. వీరంతా బాగేశ్వర్ జిల్లాలోని సామా నుంచి హోక్రాలోని కోకిలా దేవి ఆలయానికి బొలెరో వాహనంలో వెళ్తుండగా మునిసియార్ వద్ద వాహనం అదుపు తప్పి 600 మీటర్ల లోతైన లోయలో పడింది. బొలెరో వాహనం డ్రైవర్‌తోసహా అందులోని ఉన్నవారంతా ఈ ప్రమాదంలో మృతి చెందారు.

మృతులు నిషా సింగ్ (24), ఉమ్మెద్ సింగ్ (28) దంపతులు కాగా, మిగతావారు కిషన్ సింగ్ (65), ధర్మసింగ్ (69), కుందన్ సింగ్ (58), శంకర్ సింగ్ (40), సుందర్ సింగ్ (37), కుషాల్ సింగ్ (64), దాన్ సింగ్, డ్రైవర్ మహేష్ సింగ్ (40)గా గుర్తించారు. మృతుల్లో ఏడుగురు సామా గ్రామానికి చెందినవారని, ముగ్గురు బహనార్ గ్రామానికి చెందిన వారని జిల్లా విపత్తు యాజమాన్య అధికారి భూపేంద్ర సింగ్ మహర్ వివరించారు. బుధవారం రాత్రి భారీ వర్షం కురియడంతో మట్టిపెళ్లలు విరిగిపడ్డాయని, దాంతో రోడ్డు దెబ్బతినడమే వాహనం లోయలో పడడానికి దారి తీసిందని స్థానికులు చెప్పారు. ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ మృతుల కుటుంబాలకు తీవ్ర సంతాపం తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News