Friday, December 20, 2024

అఫ్ఘాన్ బాంబు పేలుళ్లలో 10 మంది మృతి

- Advertisement -
- Advertisement -

10 killed in Afghanistan bomb blasts

కాబుల్: అప్ఘానిస్తాన్‌లోని వివిధ ప్రాంతాలలో గురువారం సంభవించిన పేలుళ్లలో 10 మంది మరణించగా అనేక మంది గాయపడినట్లు పోలీసులు, ఆసుపత్రి అధికారులు తెలిపారు. ఈ పేలుళ్లకు బాధ్యులెవరో వెంటనే తెలియరాలేదు. కాగా..దేశంలోని మైనారిటీ షియా ముస్లింలు నివసించే ప్రాంతాలే లక్ష్యంగా ఈ బాంబు పేలుళ్లు జరిగాయి. ఉత్తర మజరె షరీఫ్‌లోని సాయి దోకెన్ మసీదులో ముస్లింలు ప్రార్థనలు చేస్తున్న సమయంలో బాంబు పేలుడు సంభవించి 10 మంది మరణించగా 40 మంది గాయపడ్డారు. పవిత్ర రంజాన్ మాసంలో ప్రార్థనలు చేస్తుండగా ఈ దారుణం చోటుచేసుకుంది. కాబుల్‌లో రోడ్డు పక్కన ఉన్న ఒక బాంబు పేలి ఇద్దరు పిల్లలు గాయపడ్డారు. ఈ బాంబు కూడా షియా ముస్లింలు అధికంగా నివసించే దాష్త్ ఎ బార్చి ప్రాంతంలో జరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News