Wednesday, January 22, 2025

బాంబుదాడిలో 11 మంది మృతి

- Advertisement -
- Advertisement -

బాగ్దాద్: ఇరాక్‌లోని దియాలా ప్రావిన్స్‌లో స్థానిక ఎంపి బంధువులపై జరిగిన బాంబు దాడిలో 11 మంది చనిపోయారు. మరో 14 మంది గాయపడ్డారు. గురువారం రాత్రి వారు ప్రయాణిస్తున్న వాహనం అమ్రానియా ప్రాంతానికి చేరుకోగానే కొందరు దుండగులు నాటు బాంబులతో వాహనంపై దాడి చేశారు. అనంతరం తుపాకులతో కాల్పులకు తెగబడ్డారు. దాడి అనంతరం దుండగులంతా పారిపోయారని, చనిపోయిన వారంతా సాధారణ పౌరులని పోలీసులు తెలిపారు. కాగా ఈ దాడి తామే జరిపినట్లు ఇప్పటివరకు ఏ గ్రూపు ప్రకటించుకోలేదు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఘటన జరిగిన ప్రాంతంలో కర్ఫూ విధించి దుండగుల కోసం గాలిస్తున్నారు. దాడికి పాల్పడిన దుండగులను పట్టుకుని శిక్షించి తీరుతామని దియాలా గవర్నర్ ముతన్నాఅల్ తమిమి ఒక ప్రకటనలో తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News