Tuesday, April 1, 2025

బస్సును ఢీకొట్టిన వ్యాన్..10 మంది మృతి

- Advertisement -
- Advertisement -

ప్రయాణికులతో వెళ్తున్న ప్రైవేట్ బస్సును ఒక వ్యాన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 10 మంది మరణించారు. 27 మంది గాయపడ్డారు. ఉత్తరప్రదేశ్ లోని బులంద్‌షహర్‌లో ఈ ప్రమాదం జరిగింది. ఆదివారం ఉదయం ఘజియాబాద్ నుంచి సంభాల్ వెళ్తున్న పికప్‌వ్యాన్ ప్రైవేట్ బస్సును ఢీకొట్టింది. బుదౌన్‌మీరట్ రహదారిపై జరిగిన ఈ ప్రమాదంలో 10 మంది మరణించగా, 27 మంది గాయపడ్డారు. వ్యాన్ పూర్తిగా ధ్వంసం కాగా, బస్సు ముందు భాగం దెబ్బతింది. మృతదేహాలను పోస్ట్‌మార్టమ్ కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులకు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. వారికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అధికారులను ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News