Monday, December 23, 2024

రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం… ఒకే కుటుంబంలోని 10 మంది మృతి

- Advertisement -
- Advertisement -

10 killed in road accident in Rajasthan

జైపూర్ : రాజస్థాన్‌లోని ఝుంఝునూ ప్రాంతంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 10 మంది మృతి చెందారు. మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆలయానికి వెళ్లి పదిమంది కుటుంబ సభ్యులు తిరిగి జీపులో ఝుంఝునూ గుఢా గోడ్జి జాతీయ రహదారి మీదుగా వస్తుండగా, ట్రాలీని ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగిందని ఝుంఝూనూ పోలీస్ సూపరింటెండెంట్ ప్రదీప్ మోహన్ శర్మ చెప్పారు. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. ఈ శోకాన్ని భరించేలా భగవంతుడు వారికి గుండె బలం ఇవ్వాలని, వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆయన తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారు వేగంగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈమేరకు హిందీలో ట్వీట్ చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News