Tuesday, December 24, 2024

ప్రమాదాల్లో 10మంది దుర్మరణం

- Advertisement -
- Advertisement -

10 Killed in Several Road Accident in Telangana

ఉమ్మడి మెదక్‌లో ఆటో లారీ ఢీకొని నలుగురు..
ఖమ్మం జిల్లాలో రెండు ఘటనల్లో ఐదుగురు
నల్లగొండలో ఒకరు మృత్యువాత
మన తెలంగాణ/ న్యూస్ నెట్‌వర్క్: రాష్ట్రవ్యాప్తంగా గురువారం వివిధ జిల్లాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో మొత్తం 10మంది మృత్యువాతపడ్డారు. ఉమ్మడి మెదక్ జిల్లా జగదేవ్‌పూర్‌లో ఆటోను లారీ ఢీకొనడంతో నలుగురు దుర్మరణం పాలయ్యారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం గొకినేపల్లి వద్ద ఆర్టీసీ బస్సు ఆటోను ఢీకొనడంతో ముగ్గురు, ఇదే జిల్లాలోని సత్తుపల్లి వద్ద లారీని ఓవర్‌టేక్ చేయబోయిన కారు ఎదురుగావస్తున్న మరో కారును ఢీకొని ఇద్దరు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. కాగా, నల్లగొండ జిల్లా మునగాల ప్లైఓవర్ బ్రిడ్జి మీద ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొని ఉపాధ్యాయుడు చనిపోయాడు. మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ మండల పరిధిలోని అలిరాజపేట శివారులోని వంతెన మలుపు వద్ద ఎదురుగా వస్తున్న లారీని ఆటో ఢీకొనడంతో శ్రీగిరిపల్లి కనకయ్య(35), కొట్టాల కవిత(28) అక్కడికక్కడే మృతి చెందగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కొట్టాల లలితా(33), కొంతం చంద్రయ్య (45) మృతి చెం దింది. ఇదిలా ఉండగా.. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం గొకినేపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కోదాడ నుంచి ఆర్టీసీ బస్సు ఖమ్మం వెళ్తుండగా గోకినపల్లి సమీపంలో ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణీస్తున్న నేలకొండపల్లి మండలం సదాశివపురం గ్రామానికి చెందిన తమలపాకుల బారతమ్మ, ఆమె మనువడు హర్షవర్ధన్ బాబు, ఆటో డ్రైవర్ మృతి చెందారు. కాగా గాయపడిన ఉపేందర్‌ను ఆస్పత్రికి తరలించారు. పమాదంలో ఆటో నుజ్జునుజ్జు అయ్యింది. క్రేన్ ద్వారా మృతదేహాలను బైటకు తీశారు. ఈ ఘటనతో ఖమ్మంకోదాడ రోడ్డుపై భారీగా ట్రాఫిక్ స్ధంభించిపోయింది. మృతదేహాలను ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఇదిలా ఉండగా.. ఇదే జిల్లాలోని సత్తుపల్లి ఎన్టీఆర్ నగర్ వద్ద లారీని ఓవర్‌టేక్ చేయబోయి ఎదురుగా వస్తున్న మరో కారును ఢీకొన్న ఘటనలో లారీను ఓవర్ టేక్ చేయబోయిన కారు.. ఎదురుగా వస్తున్న మరో కారును బలంగా ఢీకొనడంతో ఇద్దరి ప్రాణాలు బలి తీసుకున్న సంఘటన గురువారం సత్తుపల్లి పట్టణ శివారులోని ఎన్టీఆర్ నగర్ వద్ద చోటు చేసుకుంది. ప్రమాదం లో ఎపీలోని ఎన్టీఆర్ జిల్లాకు చెందిన తల్లీ కొడుకులైన కొడాలి భానుమతి(75), కొడాలి రంగరాజు(45) తీవ్రంగా గాయపడి, విజయవాడ తరలిస్తుండగా మృతిచెందారు. పగిడిముక్కల మండలం కపిలేశ్వరం గ్రామానికి చెందిన స్నేహితులు, బంధువులు సత్తుపల్లికి శుభకార్యానికి హాజరయ్యేందుకు వస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. కాగా, దేవికొండ నాగమణి, కొడాలి ర మా, డ్రైవర్ కొల్లిపర సాంబశివరావులకు తీవ్రగాయాలు కావడంతో సత్తుపల్లిలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా, సత్తుపల్లికి చెందిన ప్రిన్సిపాల్ బి భాగ్యలక్ష్మి, ఎండి. జబీన, సముద్రాల కల్పన, పెర్నా విశ్వేశ్వరరావు, బి. రఘునందన్‌రావులకు తీవ్రగాయాలు కాగా.. వీరు సత్తుపల్లిలో చికిత్స పొందుతున్నారు. నల్లగొండ జిల్లా మునగాల వద్ద ప్లై ఓవర్ బైక్‌పై వెళ్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు చందా వెంకట అప్పారావు (42)ను ఎదురుగా వస్తున్న మరో బైక్ ఢీకొనడంతో టీచర్‌ను తీవ్రంగా గాయపడ్డాడు. ఆయన్ను చికిత్స నిమిత్తం కోదాడకు తరలించి, మెరుగైన వైద్యం వైద్యం కోసం ఖమ్మం తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు.

10 Killed in Several Road Accident in Telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News