Sunday, January 19, 2025

అమెరికాలో కాల్పులు: పదిమంది మృతి

- Advertisement -
- Advertisement -

 

వ‌ర్జీనియా: అమెరికాలోని వ‌ర్జీనియా రాష్ట్రంలో కాల్పుల కలకలం రేగింది. చీసేపీక్‌లో ఉన్న వాల్‌మార్ట్ స్టోర్‌లో స్టోర్ మేనేజ‌ర్‌గా ఉన్న వ్య‌క్తే త‌న వ‌ద్ద ఉన్న గ‌న్‌తో విచ‌క్ష‌ణార‌హితంగా కాల్పులు జ‌రిపిన‌ట్లు సమాచారం. ఘటన అనంతరం ఆ వ్య‌క్తి త‌న‌ను తాను కాల్చుకుని మృతిచెందాడు.

చీసేపీక్ న‌గ‌ర పోలీసులు త‌మ ట్వీట్‌లో షూట‌ర్ చ‌నిపోయిన‌ట్లు తెలిపారు. కాల్పుల్లో సుమారు 10 మంది అక్కడికక్కడే చనిపోయి ఉంటార‌ని, పలువురికి గాయ‌ప‌డిన‌ట్లు పోలీసులు వెల్లడించారు. అయితే ఏ కార‌ణం చేత షూట‌ర్ దాడి చేశాడో ఇంకా తెలియాల్సిఉందని అధికారులు చెబుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News