Tuesday, January 28, 2025

గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది మృతి

- Advertisement -
- Advertisement -

గుజరాత్‌లోని నవ్‌సారి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నవ్‌సారి జిల్లా వెస్మా గ్రామ సమీపంలో బస్సు కారు ఢీ కొని పది మంది మృత్యువాత పడ్డారు. దాదాపు 30 మందికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బస్సు డ్రైవర్‌కు ఒక్కసారిగా గుండెపోటు రావడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. దాంతో బస్సు యాక్సిడెంట్ అవడంతో కారులో ఉన్న 8 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరిని ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించారు. పోలీసులు ఈ సంఘటన పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News