Thursday, January 23, 2025

దసరాకు 10 లక్షల మంది భక్తులు వస్తారు: ఇంద్రకీలాద్రి దుర్గగుడి ఇఒ

- Advertisement -
- Advertisement -

విజయవాడ: దసరాకు 10 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నామని ఇంద్రకీలాద్రి దుర్గగుడి ఈఒ భ్రమరాంబ తెలిపారు.  కోఆర్డినేషన్ కమిటి మీటింగ్ లో అన్ని సూచనలు పరిగణంలోకి తీసుకొని ఏర్పాట్లు చేశామని,  చిన్న చిన్న పనులు మినహా ఏర్పాట్లు దాదాపు పూర్తి చేశామని వివరించారు. ఇంద్రకీలాద్రిపై లైటింగ్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకోబోతున్నామని, 21 లక్షల ప్రసాదాలు సిద్దం చేస్తున్నామన్నారు.

భక్తులకు రెస్ట్ షెడ్స్ & వాష్ రూమ్స్ అధికంగా ఏర్పాటు చేశామని,  ఉచితంగా 100, 300 క్యూ లైన్స్ తో పాటు విఐపిలకు ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేశామన్నారు. భక్తులు ఎక్కడా ఆగకుండా ఉండేలా పటిష్ట ఏర్పాట్లు చేశామని వివరించారు. గతంలో 300 షవర్స్ ఏర్పాటు చేస్తే ఈసారి 800 షవర్స్ ఏర్పాటు చేశామని, వృద్దులకు, వికలాంగులకు ప్రత్యేక ఏర్పాట్లను చేశామని, ఈ ఏడాది అన్నదానం నిర్వహించడంలేదని భ్రమరాంబ చెప్పారు. భక్తులకు భోజన ప్యాకెట్స్ అందజేస్తున్నామని, అంతరాలయం దర్శనం లేదన్నారు. 250 మందితో శానిటేషన్ సిబ్బందితో శానిటేషన్ ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు.

తెల్లవారుజాము 3 గం.ల నుండి రాత్రి 10.30 వరుకు అమ్మవారి దర్శనం ఉంటుందని స్థానాచార్యులు శివప్రసాద్ శర్మ  తెలిపారు. తొలిరోజు అమ్మవారి స్నపానాభిషేకం అనంతరం ఉదయం 9 గంటల నుంచి భక్తులను అనుమతిస్తామన్నారు. ఖడ్గమాల అర్చన అంతరాలయంలో కాకుండా 6వ అంతస్తులో నిర్వహించబోతున్నామని వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News