Sunday, December 22, 2024

బాధిత ప్రీతి కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సీఎం కెసిఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ పరంగా బాధిత ప్రీతి కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియాను ప్రకటిస్తున్నాం. ప్రభుత్వ పరంగా ఆ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటాం. ప్రీతి ఘటన అత్యంత దురదృష్టం, బాధాకరం. ఎవరూ పూడ్చలేని దుఖం లో ఆ కుటుంబం ఉంది. అని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రకటించారు.

సీఎం గారు తీవ్ర ఆవేదన, విచారం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సీఎం కెసిఆర్ గారి ఆదేశాల మేరకు ఈ ప్రకటన చేస్తున్నానని మంత్రి తెలిపారు. అలాగే ప్రీతి ఘటన పై విచారణ కొనసాగుతున్నది. ఇప్పటికే నిందితుడిని పోలీసు లు అరెస్టు చేశారు. విచారణలో తేలిన దోషులు ఎంతటి వారైనా… సరే చట్ట ప్రకారంగా కఠినంగా శిక్షిస్తామని మంత్రి తెలిపారు. ప్రీతి ఆత్మ శాంతించాలని ఆ దేవుడిని మంత్రి ప్రార్థించారు. ఆమె కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News