Thursday, January 23, 2025

హవాలా నగదు పట్టివేత

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః హవాలా నగదు తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.10లక్షల నగదు, బైక్, రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం…ఉప్పల్‌కు చెందిన వి. చంద్రశేఖర్ అలియాస్ వినయ్, ప్రభాకర్ ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. చంద్రశేఖర్ ఐడిఏ ఉప్పల్‌లో ఉంటున్నాడు, షీపర్ పేపర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మేనేజింగ్ పార్ట్‌నర్‌గా ఉన్నాడు. ప్రభాకర్ అదే కంపెనీలో ఉద్యోగి. ఇద్దరికి హవాలా వ్యాపారులతో సంబంధాలు ఉన్నాయి. కమీషన్ తీసుకుని హవాలా నగదును వారు చెప్పిన వారికి అందజేస్తుంటారు.

ఈ క్రమంలోనే 16వ తేదీ రాత్రి సమయంలో బేగంబజార్‌లోని ఓ వ్యాపారి వద్ద నుంచి రూ.10లక్షలు తీసుకుని షాహినాయత్‌గంజ్ పరిధిలో ఓ వ్యక్తికి ఇచ్చేందుకు వెళ్తుండగా పోలీసులు ఆపారు. బైక్‌ను ఆపి తనిఖీ చేయగా అందులో రూ.10లక్షల నగదు లభించాయి. వాటిని సంబంధించిన ఆధారాలు చూపించడంలో వారు విఫలమయ్యారు. దీంతో నగదును స్వాధీనం చేసుకుని కేసు దర్యాప్తు కోసం షాహినాయత్‌గంజ్ పోలీసులకు అప్పగించారు. ఇన్స్‌స్పెక్టర్ రాజు నాయక్, ఎస్సైలు సాయికిరణ్, నవీన్‌కుమార్ తదితరులు పట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News