Saturday, December 28, 2024

వృద్ధాశ్రమానికి 10 లక్షలు : ఎమ్మేల్యే సుంకే రవిశంకర్

- Advertisement -
- Advertisement -

 

మల్యాల మండలం నూక పల్లి గ్రామంలో వెలమ సంక్షేమ మండలి జగిత్యాల ఆధ్వర్యంలో నిర్మించే వృద్ధాశ్రమానికి శాసనసభ నియోజకవర్గ నిధుల నుండి ఎమ్మేల్యే డా. సంజయ్ సూచన మేరకు ఎమ్మేల్యే సుంకె రవి శంకర్ 10 లక్షలు రూపాయలు కేటాయించారు. ఈ సందర్భంగా వెలమ సంక్షేమ మండలి జగిత్యాల ప్రధాన కార్యదర్శి దనపునేని వేణుగోపాలరావు ఆధ్వర్యంలో తమ కార్యవర్గ సభ్యులతో బూరుగుపల్లి లో శాసనసభ్యుల క్యాంపు కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే రవిశంకర్ మాట్లాడుతూ వృద్ధాశ్రమంలో వెలమ సభ్యుల తో పాటు ఇతర కులాల సభ్యులకు కూడా అవకాశం ఇవ్వాలని వారు కోరారు ఈ సందర్భంగా వారు శాసనసభ్యులు రవిశంకర్ ను వెలమ సంక్షేమ మండల సభ్యులు సన్మానించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన వెలమ సంక్షేమండలి ప్రధాన కార్యదర్శి వేణుగోపాలరావు ను శాసనసభ్యులు రవిశంకర్ సన్మానించారు.

ఈ కార్యక్రమంలో మల్యాల జడ్పిటిసి సభ్యులు కొండపలకల రామ్ మోహన్ రావు హిమత్ రావు పెట్ సర్పంచ్ పునుగోటి కృష్ణారావు పోతారం ఫ్యాక్స్ చైర్మన్ అయిల్నేని సాగర్ రావు కొడిమ్యల్ ఫ్యాక్స్ చైర్మన్ మేన్నేని రాజనర్సింగరావు
వెలమ సంక్షేమండలి ఉపాధ్యక్షులు అన్నమనేని సత్యనారాయణ రావు సంఘటిత కార్యదర్శి అయిల్నేని కోటేశ్వరరావు కార్యవర్గ సభ్యులు మేనేన్ని సురేందర్ రావు బండారి వేణుగోపాలరావు వక్రాల కిరణ్ రావు బెజ్జంకి అజిత్ రావు పాల్గొన్నారు ఈ సందర్భంగా వెలమ సంక్షేమ మండల సభ్యులు శాసనసభ్యులు రవిశంకర్ గారికి ధన్యవాదాలు తెలియజేశారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News