Friday, December 20, 2024

పోలీస్‌ల ముందు 10మంది నక్సల్స్ లొంగుబాటు..

- Advertisement -
- Advertisement -

దంతేవాడ: చత్తీస్‌గఢ్‌లో తీవ్రవాద ప్రభావిత దంతేవాడ జిల్లాలో 10 మంది నక్సల్స్ మంగళవారం పోలీస్‌ల ముందు లొంగి పోయారు. వీరిలో ఎనిమిది మందిపై నగదు బహుమతులు ప్రకటించి ఉన్నాయి. ఈ జిల్లాలో పోలీసులు సాగిస్తున్న తిరిగి స్వగ్రామానికి ( లాన్ వరట్టు) అనే ప్రచారోద్యమానికి ఆకర్షితులై మావోయిస్టు ఉద్యమాన్ని వీరు బహిష్కరించారని అధికారులు చెప్పారు.

లొంగిపోయిన వారిలో మిలీషియా ప్లాటూన్ కమాండర్ బండి అలియాస్ కొల్లా మడ్కమ్ (30), మిలీషియా సభ్యులు సోనా మడ్కమ్ (53), హేమంత్ కవాసీ (26), దుద్వాకొర్రం (30), మాసా మాండవి (20), లఖ్మా మాండవి (31), నందా మాండవి (33), దేవా అలియాస్ దీపక్ కాశ్యప్ (31), మాసా మాండవి (30), బుద్రా కాశ్యప్ ( 36) ఉన్నారు.

వీరిలో ఎనిమిది మందిపై రూ.8000 నుంచి 10,000 వరకు నగదు బహుమతి ప్రకటించి ఉన్నాయి. సీఆర్‌పిఎఫ్‌కు చెందిన నిఘా విభాగం వీరి లొంగు బాటులో కీలక పాత్ర వహించిందని అధికారులు తెలిపారు. 2020 జూన్ నుంచి ఇప్పటివరకు లాన్ వరట్టు ప్రచారోద్యమం కింద 578 మంది నక్సల్స్ లొంగిపోయారని అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News