- Advertisement -
బీజింగ్: చైనా దేశం జిన్‌జియాంగ్ ప్రావిన్స్ టియాన్‌షాన్ జిల్లా ఉరుంఖిలో శనివారం ఉదయం ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అపార్ట్‌మెంట్‌లో ఓ ఫ్లోర్‌లో మంటలు చెలరేగడంతో పది మంది సజీవదహనమయ్యారు. మృతులలో ఇద్దరు చిన్నారులతో పాటు ఏడుగురు ఉన్నారు. ఆ ప్రాంతంలో కరోనా వైరస్ విజృంభిస్తుండడంతో 109 రోజుల నుంచి జీరో కోవిడ్ పాలసీ పేరుతో కఠిన ఆంక్షలు విధించారు. కరోనా పాజిటివ్ కేసులుంటే ఆ ఇండ్లను లాక్ చేశారు. ఆపార్ట్‌మెంట్ లో మంటలు చెలరేగడంతో తప్పించుకొని పరిస్థితులు లేకపోవడంతో ఒకటి, రెండో ఆంతస్థుల నుంచి జనాలు కిందకు దూకారు. మరికొందరు పక్క ఫ్లాట్‌లో అతికష్టం మీద జొరబడ్డారు. కార్లు ఇష్టాను రీతిగా పార్కింగ్ చేయడంతో అగ్నిమాపక యంత్రాలు ఆ స్థలానిక వెళ్లడానికి మూడు గంటల సమయం పట్టింది.
- Advertisement -