Monday, January 20, 2025

మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదం.. 10మంది వలసవాదులు మృతి

- Advertisement -
- Advertisement -

మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దక్షిణ మెక్సికోలోని చియాపస్ లో జాతీయ రహదారిపై నిన్న(ఆదివారం) ఓ ట్రక్కు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 10మంది వలసవాదులు ప్రాణాలు కోల్పోయారు. మరో 25మందికి తీవ్ర గాయాలయ్యాయి.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. క్యూబాకు చెందిన వలసవాదులు గ్వాటెమాల నుంచి అమెరికా వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News