Sunday, January 19, 2025

ఎవరెస్ట్‌ను అధిరోహించిన 10మంది నేపాలీ గైడ్లు

- Advertisement -
- Advertisement -

ఖాట్మండు : నేపాల్ నుంచి పది మంది పర్వతారోహకుల గైడ్లు శుక్రవారం ఎవరెస్ట్ శిఖరాన్ని విజయవంతంగా అధిరోహించారు. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన శిఖరాన్ని ఈ వేసవి కాలంలో అధిరోహించిన తొలి బృందం వారిది. దాండి షెర్పా సారథ్యంలో పర్వతారోహకుల బృందం శుక్రవారం రాత్రి 8.15 గంటలకు 8848.86 మీటర్ల ఎత్తైన శిఖరాన్ని చేరినట్లు ఈ యాత్రను నిర్వహించిన సెవెన్ సమ్మిట్ ట్రెక్‌లో ఉద్యోగి థని గురాగైన్ తెలియజేశారు.

పర్వతాన్ని ఎక్కేందుకు ఆరోహకులకు వీలుగా తాళ్లు బిగిస్తూ ఆ గైడ్లు శిఖరాన్ని చేరారు. తాళ్లు బిగించే పని పూర్తి అయినందున నేపాల్, విదేశాల నుంచి పర్వతారోహకులు ఇక ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించే అవకాశం ఉంటుందని నేపాల్ పర్యాటక శాఖ పర్వతారోహణ విభాగం అధికారి చున్ బహదూర్ తమంగ్ శుక్రవారం రాత్రి నోటీస్ జారీ చేస్తూ తెలియజేశారు. శుక్రవారం ఉదయం మొదలైన తాళ్లు బిగించే పని రాత్రి ముగిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News