Sunday, September 8, 2024

మహారాష్ట్రలో విషాదం: 10 మంది శిశువులు మృతి

- Advertisement -
- Advertisement -

10 Newborn Babies Die in Fire At Hospital in Bhandara

ముంబై: మహారాష్ట్రంలో విషాదం చోటుచేసుకుంది. భండారా జిల్లా జనరల్ ఆస్పత్రిలో శుక్రవారం అర్ధరాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 10 మంది నవజాత శిశువులు మృతి చెందారు. ఐసియు-ఎన్ఎన్ యులో మంటల ధాటికి నవజాత శిశువులు మృతి చెందినట్టు అధికారులు గుర్తించారు. రాత్రి 2గంటల తర్వాత ఐసియులో మంటలు చెలరెగాయని అధికారులు చెబుతున్నారు. ఈ దుర్ఘటన జరిగిన సమయంలో ఐసియులో 17మంది చిన్నారులు ఉన్నట్టు సమాచారం. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మరో ఏడుగురిని సిబ్బంది కాపాడారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపుచేశాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్రహోం శాఖ మంత్రి అమిత్ షా, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, కాంగ్రెస్ ఎంపి రాహుల్ గాంధీ, మహారాష్ట్ర సిఎం ఉద్దవ్ థాక్రే తదితరులు దిగ్ర్బాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు వారు సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలను ఆదుకోవాలని అమిత్ షా మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News