Monday, March 17, 2025

పాకిస్థాన్‌లో దారుణం: ఉగ్రదాడిలో 10 మంది సైనికులు మృతి

- Advertisement -
- Advertisement -

క్వెట్టా: బలోచిస్థాన్ లిబరల్ ఆర్మీ(బిఎల్‌ఎ) చేసిన రైలు హైజాక్ చేసిన ఘటన మరువక ముందే మరో దారుణానికి ఒడిగట్టింది. పాకిస్థాన్ ఆర్మీ కాన్వాయ్‌ని లక్ష్యంగా చేసుకొని చేసిన బాంబుదాడిలో 10 మంది సైనికులు మృత్యువాతపడ్డారు. క్వాట్టా నుంచి టప్తాన్ వెళ్తున్న కాన్వాయ్‌పై ఈ దాడి జరిగింది. ఆర్మీ సిబ్బంది వెళ్తున్న ఎనిమిది బస్సులపై కార్పులు జరిగిన బిఎల్‌ఎ, ఒక బస్సుపై ఆత్మహుతి దాడికి పాల్పడింది. ఈ దాడిలో 10 మంది సైనికులు మృతి చెందగా.. మరో 21 మంది తీవ్రంగా గాయపడ్డారు. కానీ, బిఎల్‌ఎ మాత్రం 90 మంది సైనికులు ఈ దాడిలో చనిపోయారని చెబుతోంది. కానీ, పాకిస్థాన్ ఆర్మీ అధికారులు మాత్రం 7 మంది సైనికులే చనిపోయారని వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News