- Advertisement -
బమకో (మాలి) : పశ్చిమ ఆఫ్రికాలోని మాలిలో విషాదం చోటు చేసుకుంది. కౌలికోరో ప్రాంతంలో బుధవారం బంగారు గనిలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో 10 మంది మృతి చెందారు. గనిలో తవ్వకాలు జరుపుతుండగా కొండచరియలు ఒక్కసారిగా విరిగిపడడంతో ఈ దుర్ఘటన సంభవించింది. మృతుల్లో ఎక్కువ మంది మహిళలే. ఈ ప్రమాదంలో మరి కొందరు గల్లంతు అయ్యారు. గనిలోకి బురద నీరు ప్రవేశించి కార్మికులను చుట్టుముట్టడంతో పాటు, కొందరు శిథిలాల కింద చిక్కుకుపోయారని గవర్నన్ కల్నల్ లామైన్ కపోరి సనొగో తెలియజేశారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు. కాగా, నిరుడు జనవరిలో ఇదే ప్రాంతంలో కంగబా జిల్లాలో బంగారు గని కూలిపోయిన ఘటనలొ 70మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన విషయం విదితమే. ఆఫ్రికాలోనొ మూడు బంగారం ఉత్పత్తి దేశాల్లో మాలి ఒకటి.
- Advertisement -