Sunday, January 19, 2025

ఉగ్రవాదుల దుశ్చర్య… లోయలో బస్సు పడి 10మంది దుర్మరణం

- Advertisement -
- Advertisement -

రియాసి (కశ్మీర్): జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల దుశ్చర్య కారణంగా 10 మంది యాత్రికులు మరణించారు. రియాసి జిల్లాలో యాత్రికులతో ప్రయాణిస్తున్న బస్సుపై ముష్కరులు కాల్పులు జరపడంతో లోతైన లోయలో బస్సు పడినట్టు అధికారులు తెలిపారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశాలున్నట్టు వెల్లడించారు. శివఖోరీ ఆలయానికి వెళ్తుండగా ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడినట్టు పేర్కొన్నారు.

సంఘటన స్థలంలో పారామిలిటరీ, సైన్యం సహాయక చర్యల్లో పాల్గొన్నట్టు అధికారులు తెలిపారు. దాడి జరిగిన వెంటనే పోలీస్‌లు, సైన్యం, పారామిలిటరీ బలగాలు సంఘటన స్థలానికి చేరుకున్నాయని పోలీస్‌లు చెప్పారు. రాజౌరి, పూంచ్, రియాసి ఎగువ ప్రాంతాల్లో దాక్కున్న ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడినట్టు పోలీస్‌లు అనుమానిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News