Monday, December 23, 2024

బిఆర్‌ఎస్‌ ఆత్మీయ సమ్మేళనంలో అపశృతి: 10 మందికి గాయాలు (వీడియో)

- Advertisement -
- Advertisement -

కారేపల్లి: ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చీమలపాడులో బుధవారం అగ్నిప్రమాదం సంభవించింది. వైరా నియోజకవర్గంలో నిర్వహించిన బిఆర్‌ఎస్‌ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో బిఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు, వైరా ఎమ్మెల్యే రాములు నాయక్‌, ఇతర నేతలు పాల్గొన్నారు. బిఆర్ఎస్ కార్యకర్తలు పేల్చిన బాణసంచాతో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. బాణసంచా నిప్పురవ్వలు పడి పూరి గుడిసె దగ్ధం అయింది. దీంతో భారీగా మంటలు చేలరేగాయి. నేతలు రాక సందర్భంగా బిఆర్ఎస్ కార్యకర్తలు బాణసంచా కాల్చారు.

Also Read: బాలుడికి ముద్దు పెట్టి తన నాలుక చప్పరించమన్న దలైలామా (వీడియో)

మంటల వల్ల ఇంట్లోని సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డవారిలో ఇద్దరు పోలీసులు, ఇద్దరు జర్నలిస్టులు ఉన్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. ఇద్దరు కానిస్టేబుళ్లకు కాళ్లు కోల్పోయినట్లు సమాచారం. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. ప్రమాదం వల్ల బిఆర్ఎస్ కార్యకర్తలు సభ నుంచి వెళ్లిపోయారు. దీంతో బిఆర్ఎస్ ఆత్మయ సమ్మేళనాన్ని నేతలు ఆర్థంతరంగా నిలిపివేశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News